నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని పిట్టంపల్లి వెలిమినేడు గుండ్రంపల్లి గ్రామాలలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఆనాడు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిందని మధ్యలో రాజశేఖర్ రెడ్డి మళ్ళీ నేడు రేవంత్ రెడ్డి పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చారన్నారు. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందజేస్తుందన్నారు.