పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరేట్ తరలింపు పై భీమవరం నియోజకవర్గ వైసిపి ఇంచార్జ్ చినిమిల్లి వెంకట రాయుడు పట్టణంలో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు మీడియాతో మాట్లాడారు. శనివారం ఉదయం 10 గంటలకు భీమవరం పట్టణంలోని చాంబర్ ఆఫ్ కామర్స్ నందు కలెక్టరేట్ తరలింపునకు వ్యతిరేకంగా అఖిలపక్షాలు ప్రజాసంఘాల నేతృత్వంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నామని చెప్పారు. దీనిలో వివిధ రాజకీయ నేతలు, ప్రజాసంఘాలు, ఆసక్తి కలిగినటువంటి విద్యావేత్తలు, మేధావులు, అందరూ కూడా పాల్గొనవలసిందిగా ఆయన కోరారు.