విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రముఖ నటులు తనికెళ్ల భరణి అన్నారు. జిల్లా కేంద్రంలోని జయప్రకాష్ నారాయణ కాలేజీలో సోమవారం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు నాలుగు సంవత్సరాలు కష్టపడితే గొప్పగా ఎదుగుతారన్నారు