సిద్దిపేట జిల్లా తొగుట మండల పరిధిలోని మల్లన్న సాగర్ రిజర్వాయర్ కట్టపై దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కలిసి బుధవారం ధర్నా నిర్వహించారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుల చిత్రపటాలకు గోదావరి జలాలతో అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి నియోజకవర్గంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్టుల ద్వారా న