వినాయక చవితి పర్వదినం సందర్భంగా వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో బుధవారం ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వారికి ఘన స్వాగతం పలికారు. వేములవాడ రాజన్న తోపాటు నాగిరెడ్డి మండపంలో ప్రతిష్టించిన విగ్నేశ్వరునికి విశేష పూజలు చేశారు. అనంతరం అర్చకులు అద్దాల మండపంలో వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వినాయక చవితి సందర్భంగా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్టు తెలిపారు.