ఆళ్లగడ్డలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి తాను ఆళ్లగడ్డ వదిలి వెళ్లేది లేదంటూ పోలీసులకు స్పష్టం చేసినట్లు సమాచారం. ఇక్కడే ఉంటూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని చెబుతునున్నట్లు తెలుస్తోంది. సుబ్బారెడ్డి ఆళ్లగడ్డ వదిలి వెళ్లాలంటూ ఎమ్మెల్యే అఖిలప్రియ అల్టిమేటం జారీ చేసినట్లు వార్తలొస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఆళ్లగడ్డ పరిణామాలపై టీడీపీ పెద్దలు ఆరా తీసినట్లు సమాచారం.