కల్లుగీత కార్మికుల సమస్య లను ప్రభుత్వం పరిష్కరించాలని కల్లుగీతా కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఆశన్న గౌడ్ డిమాండ్ చేశారు. గీత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సంగారెడ్డిలో నిర్వహించిన రిలే నిరాహార దీక్షలు పాల్గొన్న ఆశన్న గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. తాటి చెట్లు పెంచుకునేందుకు 5 ఎకరాలు కేటాయిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు ఇవ్వలేదని చెప్పారు. గీతా కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం చేస్తామని పేర్కొన్నారు.