ఉప్పలగుప్తం మండల కాపునాడు మండల అధ్యక్షునిగా మద్దింశెట్టి సురేష్ ను నియామకం చేసారు. ఆదివారం సాయంత్రం 7 గంటలకు అమలాపురంలోని కాపునాడు కార్యాలయం వద్ద కాపునాడు రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు అబ్బిరెడ్డి సురేష్ ద్వారా ఉత్తర్వులు అందుకున్నారు. మండలంలో కాపుల అభ్యున్నతి,సంక్షేమం కొరకు దివంగత వంగవీటి మోహన రంగా,పిళ్ళా వేంకటేశ్వర రావు వంటి పోరాట యోధుల స్పూర్తితో నిర్విరామంగా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కాపు నాయకులు గంగుమళ్ళ శ్రీనివాస్,నిమ్మకాయల జగ్గయ్య నాయుడు,అరిగెల నానాజీ,పోలిశెట్టి భాస్కరరావు, పాల్గొన్నారు.