భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరగడంతో కె.గంగవరం మండలం, కోటిపల్లి గోదావరి వరద క్రమేపీ పెరుగుతోంది. దీంతో లంక భూముల్లో వ్యవసాయం చేస్తున్న రైతులు రాకపోకలకు పడవలపై ఆధారపడుతున్నారు. తమ వ్యవసాయ ఉత్పత్తులు, పశుగ్రాసం వంటి వాటిని పడవలపైనే తరలిస్తున్నారు. ఈ సీజన్లో మూడో సారి వరద ప్రవాహం పెరిగిందని ఎవరు ఇబ్బందులు పడుతున్నామని వరద తగ్గేంతవరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాపోయారు