ఎమ్మిగనూరు : సీజనల్ వ్యాధులపై జాగ్రత్తలు అవసరం..సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గోనెగండ్ల ఆయుష్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఖాద్రీ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ, రోగాల బారిన పడకుండా ఇండ్ల ముందర నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దోమతెరలు వాడుతూ మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చన్నారు. అధిక శాతం మంది మలేరియాతో బాధపడుతున్నారని, ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.