శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం సబ్ జైలు ను సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వర్లు నాయక్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఖైదీల కోసం తయారుచేసిన ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా ఖైదీలతో యోగాసనాలు వేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తప్పులు చేసి జైలుకు వచ్చిన తర్వాత మార్పు రావాలన్నారు. తప్పులు చేసి జైళ్లకు రావడం వల్ల కుటుంబ మర్యాద దెబ్బ తినడంతో పాటు ఆర్థికంగా కూడా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని కనీసం కారాగారం నుండి బయటకు వెళ్లిన తర్వాత మార్పు వచ్చి ప్రశాంత జీవనం సాగించాలని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాల