అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ కేంద్రంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలపై కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెల 9న గుంతకల్ ఆర్డిఓ కార్యాలయం ఎదుట చేపట్టనున్న అన్నదాత పోరుబాట కార్యక్రమం పోస్టర్లను వైఎస్ఆర్సిపి నాయకులు ప్రజాప్రతినిధులు అనుబంధ సంఘాల నాయకులు కలిసి విడుదల చేశారు. ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వై. విశ్వేశ్వర్ రెడ్డి నాయకత్వంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అన్నదాత పోరు బాట కార్యక్రమం నిర్వహించి ఆర్డిఓ కి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు.