ప్రకాశం జిల్లా బేస్తవారిపేటలో చిన్న బ్రహ్మయ్య హత్యకు గురయ్యాడు. జరిగిన ఘటనపై స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పటికే హత్య కేసు గా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ నాగరాజు తెలిపారు. పోస్టుమార్టం కొరకు మృతదేహాన్ని తరలిస్తున్న సమయంలో కుటుంబ సభ్యులు పోలీసులను అడ్డుకున్నారు. తమ కుమారుడిని హత్య చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. దర్యాప్తు జరుగుతుందని పోస్టుమార్టం లో మరిన్ని సాక్ష్యాలు లభిస్తాయని చిన్న బ్రహ్మయ్య కుటుంబ సభ్యులకు పోలీసులు చెప్పిన కుటుంబ సభ్యులు పోస్టుమార్టం నిర్వహించేందుకు అడ్డు చెబుతూ నిరసన కొనసాగిస్తున్నారు.