ప్రశాంతమైన వాతావరణంలో వినాయక నిమజ్జన కార్యక్రమం నిర్వహించుకోవాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ తెలిపారు. మంగళవారం వినాయక నిమజ్జనం జరుగు కోమటి చెరువును పోలీస్ కమిషనర్ బి. అనురాధ పరిశీలించారు. ఈ మేరకు వినాయక నిమజ్జనానికి వచ్చే రూట్ మ్యాప్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ అనురాధ మాట్లాడుతూ.. నిమజ్జనం సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని, నిమజ్జనం జరిగే ప్రదేశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రజలకు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. మండపాల ఆర్గనైజర్లు, మరియు కార్యవర్గ