వరంగల్ నగరంలోని ఎంజీఎం జంక్షన్ లో గణేష్ చతుర్థి సందర్భంగా విగ్రహాలనుకునేందుకు వచ్చిన వారు రోడ్లపై ఇష్టం వచ్చినట్లుగా పార్కింగ్ చేశారు. దీంతో బుధవారం ఉదయం సుమారు 11 నుండి 12 గంటల ప్రాంతంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం అయి అంబులెన్సులు కూడా ఎంజీఎం హాస్పిటల్ లోనికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో సమాచారం తెలుసుకున్న మట్టవాడ ట్రాఫిక్ మరియు లా అండ్ ఆర్డర్ పోలీసులు టోయింగ్ వెహికల్ ని తీసుకువచ్చి రోడ్లపై పార్కింగ్ చేసిన వాహనాలన్నింటినీ పోలీస్ స్టేషన్కు తరలించారు వాహనదారులకు భారీగా జరిమానాలు విధించారు.