కొయ్యూరు మండలంలోని మంప పోలీస్ స్టేషన్ పరిధిలోని మంప గ్రామంలో నాటుసారా విక్రయాలు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని మంప ఎస్సై కే.శంకరరావు శుక్రవారం సాయంత్రం తెలిపారు. ముందస్తు సమాచారంతో తమ సిబ్బందితో కలిసి మంపలో తనిఖీలు నిర్వహించగా, నాటుసారా విక్రయిస్తూ గ్రామానికి చెందిన కొమ్ము అప్పారావు, గోకిరి సత్తిబాబు అనే ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారన్నారు. వారిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 10 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి వారిని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.