పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు శనివారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలో 106 మంది అనారోగ్య పీడితులకు ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ నుండి మంజూరైన 61 లక్షల రూపాయల విలువైన చెక్కులు అందజేశారు.స్త్రీ శక్తి పథకం విజయోత్సవ సభలో పాల్గొన్నారు.డ్వాక్రా గ్రూపులకు దాదాపు 11కోట్ల రూపాయల విలువైన రుణాల చెక్కులు పంపిణీ చేశారు.మార్టూరులో 60 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే అన్న క్యాంటీన్ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు.ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టిడిపి పాలన సాగుతుందని ఏలూరి పేర్కొన్నారు.