కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయడం లేదని ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి విమర్శించారు. గుంటూరులో బుధవారం ఆయన మాట్లాడారు. హామీల పేరుతో ప్రజలను వెన్నుపోటు పొడిచారని దుయ్య బట్టారు. 40 ఏళ్ళ ఇండస్ట్రీ, నాలుగుసార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ప్రజాస్వామ్య బద్దంగా పాలన సాగించడం లేదని మండిపడ్డారు. ప్రజల పక్షాన వైసిపి పోరాడుతుందని ఎమ్మెల్సీ అప్పిరెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న వెన్నుపోటు దినాన్ని పోలీసులను అడ్డుపెట్టుకొని అధికార పార్టీ వెన్నుపోటు దినానికి ప్రజల రానికుండా అడ్డుకున్నారన్నారు.