మార్కాపురం జిల్లా ఏర్పాటు తద్యమని ప్రకాశం జిల్లాకు చెందిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రకటించారు. సోమవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ మార్కాపురం జిల్లా ఏర్పాటు చేసి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని ఉద్ఘాటించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రక్రియ జరుగుతుంది అని చెప్పారు. వైసీపీ లాగా గాలి మాటలు చెప్పే నైజం టిడిపి ప్రభుత్వానిది కాదన్నారు. సూపర్ సిక్స్ లో కూడా 90 శాతం వాగ్దానాలు నెరవేర్చమన్నారు.