యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్ట అనుబంధ ఆలయమైన పర్వత వర్ధిని సమేత రామలింగాల స్వామి ఆలయంలో లంబోదరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు గణపతి పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, పంచగవ్య ప్రాశనం, వినాయక వ్రతం, మహా నివేదన హారతి, మంత్రపుష్పం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.