సమయపాలన పాటించి, సకాలంలో వైద్యం అందించాలని అల్లూరి సీతారామరాజు జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్ అన్నారు. బుధవారం సాయంత్రం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ టీ.విశ్వేశ్వర నాయుడుతో కలసి అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరులోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిని సందర్శించారు. రోగుల విభాగం, రోగుల విభాగంలో కాసువాలిటీ, అత్యవసర కేసులు, వార్డులు-మెడికల్, సర్జికల్, గైనెక్ డిపార్ట్మెంట్ సందర్శించారు. పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రోగులకు మందులు అందజేశారు.