కురబలకోటలో స్వచ్ఛాంధ్ర సాధనకోసం అధికారుల ప్రతిజ్ఞ.. కురబలకోట మండలంలోని అన్ని సచివాలయాల్లో శనివారం అధికారులు స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగళ్లు గ్రామంలో ప్రత్యేక అధికారి వాణి ఆధ్వర్యంలో పరిశుభ్రత, ప్రాధాన్యత, మొక్కల పెంపకం వల్ల లాభాలను వివరిస్తూ విద్యార్థులతో కలసి ర్యాలీ చేశారు. మురికి కాలువలు శుభ్రం చేసి దోమల నివారణకు మందులు చల్లారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకుని స్వచ్ఛాంధ్ర నిర్మాణంలో భాగస్వాములం అవుతామని ప్రతిజ్ఞ చేశారు.