అనంతపురం జిల్లా పామిడి పట్టణంలోని గల్లీ వినాయక గణేష్ సర్కిల్ ఆధ్వర్యంలో దారపు రీళ్ళతో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. పామిడి పట్టణానికి చెందిన భాస్కర్, విష్ణు, శివ, చంద్రలు సుమారు 20రోజుల పాటు కష్టపడి దారపు రీళ్లు కొనుగోలు చేసి వినాయక విగ్రహాన్ని తయారు చేశారు. కాదేది వినాయక రూపానికి అనర్హం అన్న రీతిలో కూలీ పనులకు వెళ్ళే యువకులు చేసిన విగ్రహం పామిడి పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హిందువుగా జన్మించిన వెంటనే మొలత్రాడు నుంచి మొదలు మృతి చెందిన వారికి ఊపయోగించే వస్త్రం వరకు దారం ప్రధానమని పర్యావరణ రహిత విగ్రహాన్ని తయారు చేశామన్నారు.