కరీంనగర్ లోని మానేరు డ్యాం వద్ద ఆత్మహత్యకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని కాపాడినట్లు లేక్ పోలీసులు ఆదివారం తెలిపారు.సిద్దిపేట జిల్లా కోహెడ కు చెందిన వేల్పుల సంపత్ కుటుంబ కలహాల నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి డ్యాం లోని నీళ్లలోకి వెళ్లి ఆత్మహత్యాయత్నం చేయగా, గమనించిన హోంగార్డు శ్రీనివాస్ కాపాడినట్లు తెలిపారు. కౌన్సిలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు. సమయస్ఫూర్తితో సంపత్ ను కాపాడిన హోంగార్డు శ్రీనివాస్ ను జిల్లా ఉన్నత అధికారులు అభినందించారు.