ఏలూరు జిల్లా కైకలూరు పట్టణంలో వినాయక విగ్రహ నిమజ్జల కార్యక్రమంలో శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో చిన్న అపశృతి చోటు చేసుకుని రెండు వర్గాల మధ్య చిన్న ఘర్షణ జరిగిందని ఈ నేపథ్యంలో పోలీసులు సకాలంలో స్పందించి ఇరువర్గాలను శాంతింపపరిచి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీసు భద్రత ఏర్పాట్ల మధ్య వినాయక నిమజ్జల కార్యక్రమం చేసినట్లు ఏలూరు డిఎస్పి శ్రావణ్ కుమార్ తెలిపారు కొన్ని సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఇరువర్గాల ఘర్షణ అంటూ దుష్ప్రచారం చేస్తూ ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు