పలమనేరు: మండలం పోలీస్ వర్గాలు తెలిపిన సమాచారం మేరకు, కొలమాసనపల్లె గ్రామానికి చెందిన యశ్వంత్ అనే యువకుడు తమిళనాడు రాష్ట్రం అంబూర్ నందు బొలెరో వాహనంలో ప్రయాణిస్తూ లారీని ఢీకొని రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడని సమాచారం వచ్చింది. నేడు అతని మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి కుటుంబీకులు అంత్యక్రియలు చేశారు. చేతికొచ్చిన కుమారుడు మృతి చెందడంతో ఆ కుటుంబం తీవ్ర కన్నీటితో తల్లడిల్లిపోయింది, దీంతో గ్రామం నందు విషాదఛాయలు అలుముకున్నాయి.