కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో, వాటిలోని సమస్యలను, అధికారులకు వివరిస్తున్న సమయంలో, పవర్ ఆగిపోయింది, మున్సిపాలిటీ అధికారులు జనరేటర్ ను, ఆన్ చేసే ప్రయత్నం చేసిన విప్లమయ్యారు. దీంతో మున్సిపాలిటీ అధికారులపై కౌన్సిలర్లు ధ్వజమెత్తారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఉన్నదని తెలిసి కూడా, కమిషనర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని. ఇదే సమావేశానికి కలెక్టర్ వస్తే ఏమయ్యేది అని ప్రశ్నించారు. మున్సిపాలిటీ పని తీరుపై పూర్తిగా కౌన్సిలర్లు అసహనాన్ని వ్యక్తం చేశారు.