ఒక వ్యక్తి మెడపై కత్తితో పొడిచి హత్యాయత్నం చేసి, అతని మరణానికి కారణమైన ఘటనలో II ADJ కోర్టు సంచలన తీర్పు, నిందితుడికి కఠిన కారాగార జీవిత ఖైదు , నష్ట పరిహారంగా బాధితుని కుటుంబానికి రూ.3,00,000/- జరిమానా విధిస్తూ తీర్పు న్యాయస్థానం వెలువరించిందని పోలీస్ కమిషనర్ పత్రిక ప్రకారం ద్వారా గురువారం తెలిపారు 2016వ సంవత్సరం ఒకటవ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన హత్యాయత్నం పై ఫిర్యాదుదారుడు తెలియజేస్తూ, తన సోదరుడు కృష్ణను పాత కక్షల కారణంగా నిందితుడు దుర్గా రావు కత్తితో మెడకు పొడిచి హత్యాయత్నం చేశాడని, ఈ దాడిలో బాధితునికి తీవ్రమైన రక్తస్రావం అవ్వడం జరిగిందన్నారు