రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్ళపల్లి గ్రామ శివారులో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్, లారీని రెండు వాహనాలను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉపేంద్ర చారి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం రోజున ఉదయం ఐదు గంటల సమయంలో పెట్రోలింగ్ చేస్తుండగా తంగళ్ళపల్లి గ్రామ శివారులో ఒక ఇసుక టిప్పర్, లారీ సిరిసిల్ల నుండి హైదరాబాద్ వెళ్తుండగా వాటిని పట్టుకొని తనిఖీ చేశారు. ఇసుక రవాణాకు సంబంధించి ఎలాంటి అనుమతులు లేనందున రెండు ఇసుక వాహనాలను సీజ్ చేసి డ్రైవర్లు, వాహన యాజమాన్యాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై ఉపేంద్ర చారి తెలిపారు.