విశాఖ స్టీల్ ప్లాంట్ లో యాజమాన్యం ప్రకటించిన 46 విభాగాల ఈఓఐ తక్షణమే రద్దు చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు ప్రభుత్వ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. నేడు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ యాజమాన్యాలు ప్రకటించిన ఈఓఐ లను వ్యతిరేకిస్తూ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ నుండి పాత గాజువాక జంక్షన్ వరకు"బైక్ ర్యాలీ" నిర్వహించారు.అనంతరం జరిగిన సభలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు మాట్లాడారు