అంబేడ్కర్ పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ అంబేడ్కర్ ఆత్మ గౌరవ ఉమ్మడి ఉద్యమకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్లో ఆదివారం భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని ప్రధాన రహదారులు గుండా సాగిన ర్యాలీలో వివిధ సంఘాల నాయకులు, రాజకీయ పార్టీ నేతలు పాల్గొన్నారు. నిరసన నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంబేద్కర్ను అవమానించిన అమిత్ షా పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.