క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక ద్రుఢత్వం లభిస్తుందనీ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.శుక్రవారం వేములవాడ పట్టణంలో నాంపల్లి లో స్కూల్ గేమ్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన వేములవాడ అర్బన్ మండల స్థాయి ఆటల పోటీల్లో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతు క్రీడా పోటీల నిర్వహణ వల్ల మానసిక ఉల్లాసంతో పాటు ఇతర ప్రాంతాల ప్రజలతో స్నేహభావం పెరగడానికి ఉపయోగపడుతుందని అన్నారు.