నిర్మల్ జిల్లా బైంసా మండలం గుండెగాం గ్రామాన్ని పునరావాస గ్రామంగా ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ పల్సీకర్ రంగారావ్ బ్యాక్లాగ్ వాటర్ తో ప్రతి ఏటా వర్షాకాలంలో గ్రామం ముంపుకు గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత పదేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొందని అన్నారు. అధిక వర్షాలు కురిసే సమయంలో అధికారులు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నివాసాల్లో తాత్కాలికంగా అరకొర వసతుల్లో నివసిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పునరావాసం కోసం దాదాపు రూ.61 కోట్లు అవసరం అని గుర్తించి మంజూరయ్యాయని, అదనంగా మరో రూ.33 కోట్లు అ