బెల్లంపల్లి పట్టణంలోని పోచమ్మ చెరువు వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను మంచిర్యాల డిసిపి భాస్కర్ సబ్ కలెక్టర్ మనోజ్ పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక నిమజ్జనం రోజు ప్రతి ఒక్కరు జాగ్రత్త పాటించి నిమజ్జనం చేయాలని సూచించారు విగ్రహాలను తరలించే సమయంలో విద్యుత్ షాక్ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు చిన్న పిల్లలు గుండె సంబంధిత వ్యాధిగ్రహస్తులను దృష్టిలో పెట్టుకొని డిజెలను నిషేధించినట్లు పేర్కొన్నారు