రవీంద్ర భారతిలో సంచార యుక్త జాతుల దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కార్య క్రమాన్ని ఉత్సాహంగా వీక్షించారు. మండలి డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాశ్, ఎంపీ ఈటల రాజేందర్, బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఎంబీసీ కార్పొరేషన్ ఛైర్మన్ జరిపాటి జైపాల్, మాజీ ఐఏఎస్ చిరంజీవి, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమయాదేవి తదితరులు పాల్గొన్నారు.