నార్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుంగాపూర్ గ్రామ శివారులో గాంజాయ్ పండిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు సీసీఎస్ బృందం, నార్నూర్ పోలీసులు సంయుక్తంగా పంటచేళ్లలో తనిఖీలు చేపట్టారు. కాగా కొడప దేవురావు అనే వ్యక్తి వ్యవసాయం మాటున చట్ట వ్యతిరేకంగా పండిస్తున్న 95 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై ఎన్.డి.పి.ఎస్ కేసు నమోదు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, వ్యవసాయ భూమిలో చట్ట వ్యతిరేకంగా గంజాయి మొక్కలను పండిస్తున్న వ్యక్తి పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించిన్నట్లు తెలిపారు.