నల్గొండ పట్టణం, మర్రిగూడ రోడ్డులో గల హెచ్పి పెట్రోల్ బంకు సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు లభ్యమయింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతి చెందిన వ్యక్తి వయస్సు సుమారు 55 నుండి 60 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతుడు నలుపు రంగు చొక్కా, గల్లలుంగి ధరించి ఉన్నాడని, ఆచూకీ తెలిసినవారు నల్గొండ పట్టణ వన్ టౌన్ సిఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నెం. 8712670141కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.