గుంటూరు నగరంలో 5 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. తన ఛాంబర్లో సోమవారం కమిషనర్ శ్రీనివాసులు మాట్లాడారు. నగరంలో ప్రత్యేక యాప్ ద్వారా మొక్కలు నాటేందుకు సర్వే చేయించామని చెప్పారు. మిషన్ గ్రీన్ గుంటూరు లోగో డిజైన్కి 500 ఎంట్రీలు వచ్చాయని, అందులో ఒక దాన్ని ఎంపిక చేశామని చెప్పారు.