నల్గొండ జిల్లా, మాడుగులపల్లి మండల కేంద్రంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం యొక్క పూర్తి వివరాలను మాడుగులపల్లి పోలీసులు సాయంత్రం వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండల పరిధిలోని రుద్రారం గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు ట్రాక్టర్ లో చేపల వేటకు వెళ్తున్న క్రమంలో మాడుగులపల్లి మండల కేంద్రంలో ఉదయం బొలెరో వాహనం డీ కోట్టగా ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రుద్రారం గ్రామానికి చెందిన రామయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడి, మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.