సోమవారం ఉదయం 11.30 నిమిషాలకు సీపీఎస్‌ను రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలంటూ TNGO'S హనుమకొండ జిల్లా యూనియన్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జంక్షన్‌లో ధర్నా చేపట్టారు. అనంతరం అంబేడ్కర్ జంక్షన్ నుంచి కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాత పెన్షన్ విధానాన్ని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.