ఒడిశా తీరానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని, దీని ప్రభావంతో అల్లూరి జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. బుధవారం రాత్రి అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరులోని జిల్లా కలెక్టరేట్ నుంచి అధికారులతో టెలికాన్ఫెరెన్స్ నిర్వహించారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. గోదావరి, శబరి నీటి ఉదృతి అధికంగా ఉన్న దృష్ట్యా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు.