హీరో రాజ్ తరుణ్ తోపాటు అతడి అనుచరులపై నార్సింగి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు..జూన్ 30న లావణ్య తండ్రితోపాటు ఆమె కుటుంబంపై రాజరుణ్ అనుచరులు దాడి చేశారు. మణికొండలోని తమ ఇంటికి 50మంది గ్యాంగ్ వచ్చి దాడి చేసి, ఇంట్లో సామగ్రిని ధ్వంసం చేశారని, తన తండ్రికి గాయాలయ్యాయని లావణ్య ఫిర్యాదు చేశారు. ఈ విషయం సైబరాబాద్ CP దృష్టికి వెళ్లడంతో ఆయన ఆదేశాలతో పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు.