ఆదిలాబాద్లోని రాణిసతిజీ ఆలయంలో పొలాల అమావాస్యను పురస్కరించుకుని 3 రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా శనివారం 56 భోగ్, మహా హారతి, ప్రసాద వితరణ కార్యక్రమాలను చేపట్టారు. పండితుల మంత్రోచ్చరణల మధ్య అమ్మవారికి పూజలు చేసి, నైవేద్యం సమర్పించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని కోరుతూ గత 52 ఏళ్లుగా ఈ పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు