గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సిద్దిపేట పట్టణంలో పలు కాలనీలు నీట మునిగాయి. సిద్దిపేట పట్టణంలోని శ్రీనగర్ కాలనీ నీట మునగడంతో.. కాలనిలో రోడ్లపై నుంచి వరద ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. పలు ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ మేరకు గురువారం సిద్దిపేట మున్సిపల్ అధికారులు కాలనీలో నిలిచిన నీటిని తొలగించడానికి చర్యలు చేపట్టారు. అలాగే సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువు నిండుకుండలా తలపిస్తుంది. దీంతో కోమటి చెరువు మత్తడి పారుతుంది. కోమటిచెరువు నుంచి వచ్చే కాలువ ఉధృతంగా ప్రవహిస్తుడటంతో పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ మధ్యలో రాకపోకలను అధికారులు నిలిపివేశారు.