బాపట్ల జిల్లాలో కౌలు రైతులకు సీపీఆర్సీ కార్డులు మంజూరు చేశామని, అయితే వారికి రుణాలు ఇవ్వడంలో బ్యాంకర్లు సహకరించడం లేదని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో బ్యాంకర్ల సమావేశాలు నిర్వహించి, సీసీఆర్సీ కార్డులు పొందిన రైతులకు రుణాలు మంజూరు చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆయన డీఏవో, ఆర్డీవో, ఎంఏవోలను ఆదేశించారు.