పెంచిన విద్యుత్ సర్దుబాటు చార్జీలను తగ్గించాలని, వ్యవసాయ మోటార్లకు, గృహాలకు స్మార్ట్ మీటర్ల బిగింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, అదానితో జరిగిన విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేయాలని ఈనెల 5న విద్యుత్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని, శుక్రవారం సిపిఐ, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే. మద్దిలేటి శెట్టి, బి. వీరశేఖర్ లు డిమాండ్ చేశారు. వామపక్ష పార్టీల రాష్ట్ర సమితి పిలుపు మేరకు దేవనకొండ సిపిఎం కార్యాలయం నందు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.