పలమనేరు: పట్టణం నుంచి రగ్బీ జాతీయ జట్టుకు ఎంపికై ప్రాతినిధ్యం వహించిన నర్రా అక్షయను పలమనేరు బలిజ అభ్యుదయ సేవా సంఘం BASS తరపున ఘనంగా సన్మానించారు. స్థానిక శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వద్ద ఆమెను దుశ్శాలువతో సన్మానించి మొమెంటో అందజేశారు. భవిష్యత్లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి పలమనేరుకు, చిత్తూరుజిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, మరియు దేశానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ DCC అధ్యక్షుడు సుధాకర్, బలిజ సంఘ నాయకులు రూపేష్,అరుణ్,బాబు,కిరణ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.