నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం మూసి ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాక ప్రస్తుతం అది 641.80 అడుగులకు చేరిందని శుక్రవారం ప్రాజెక్టు అధికారులు ఓ ప్రకటన లో తెలిపారు.ఇన్ ఫ్లో 7202.38 క్యూసెక్కులు ఉండగా అవుట్ ఫ్లో 9114.41 క్యూసెక్కులుగా ఉందన్నారు. ఈ వరదను నియంత్రించేందుకు అధికారులు C2,C3,C4,C7,C8,C10 గేట్లను రెండు అడుగుల మేర పైకి ఎత్తి దిగువకు వీటిని విడుదల చేసినట్లు తెలిపారు.