కరీంనగర్ లో ముదిరాజ్ పోరాట సమితి భారీ బహిరంగ సభ బుధవారం నిర్వహించారు. ముదిరాజ్ పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ ముదిరాజ్, నీలం మధు ముదిరాజ్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలోని ముద్దిరాజుల ను BCD నుంచి BCA కు చేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. నిజామాబాద్ లో జరగబోయే సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తారని నమ్మకం ఉందన్నారు.బిఆర్ఎస్ పార్టీ ముదిరాజులను మోసం చేయడం వల్లే ఆ పార్టీ ఓటమిపాలైందని అన్నారు. రాబోయే స్థానిక సంస్థలలో ముదిరాజులకు అధిక సంఖ్యలో టికెట్లు కేటాయించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.