రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అగ్రహరంలోని ఓ ఫంక్షన్ హాల్ లో మిడ్ మానేరు రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకేజి కింద 1550 ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్,కలెక్టర్ సందీప్ కుమార్ ఝ పంపిణీ చేశారు.గత ప్రభుత్వం 5 లక్షలు ఇస్తానని మోసం చేసిందని,దానిపై కాంగ్రేస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేశామని గుర్తు చేశారు.వెనుకబడిన వేములవాడ ను అభివృద్ధి చేయాలని అనేక ధర్నాలు చేశామని,నేడు ప్రజా ప్రభుత్వంలో వెనుకబడిన వేములవాడను ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు.240 కోట్లతో ముంపు గ్రామాల ప్రజలకు 4696 ఇల్లు మంజూరు చేశామని చెప్పారు.